తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారులపై మంత్రి హరీశ్​రావు అసహనం - minister harish rao fires on municipality commissioner at siddipet

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో పట్టణాభివృద్ధిపై డివిజన్​ స్థాయి అధికారులతో మంత్రి హరీశ్​రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సరైన సమాధానాలు ఇవ్వనందున కమిషనర్​ రాజమల్లయ్యపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులపై మంత్రి హరీశ్​రావు అసహనం

By

Published : Nov 20, 2019, 9:00 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో అభివృద్ధిపై డివిజన్​ స్థాయి అధికారులతో మంత్రి హరీశ్​రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల కమిషనర్​, మున్సిపల్ సిబ్బందిపై హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన రూ.50 లక్షలు నిధులు దేనికోసం ఉపయోగించారని ప్రశ్నించారు. కమిషనర్ రాజమల్లయ్య సరిగ్గా సమాధానం ఇవ్వనందున తీరు మార్చుకోవాలని మంత్రి సూచించారు.రానున్న రెండు, మూడు రోజుల్లో ప్రజాప్రతినిధులు తెలిపిన సమస్యలు పరిష్కరించాలని.. లేదంటే తగు చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.

అధికారులపై మంత్రి హరీశ్​రావు అసహనం

ఇదీ చూడండి: పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు

ABOUT THE AUTHOR

...view details