Harish Rao Fires on Congress : ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అధికార ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. 10 ఏళ్ల అభివృద్ధినే అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
Harish Rao Road Show in Husnabad :కాంగ్రెస్, టీడీపీ పాలనలో హుస్నాబాద్ అభివృద్ధి చెందలేదనిమంత్రి హరీశ్‌రావు అన్నారు. హుస్నాబాద్‌లో రోడ్ షోలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని తెలిపారు. కోహెడ మండలంలోని అన్ని గ్రామాలకు భవనాలు మంజూరు చేశామని వెల్లడించారు. కేసీఆర్ వచ్చాక ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు వచ్చాయన్న మంత్రి.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. కరోనా వచ్చినప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించారు.
విపక్ష పార్టీల సుడిగాలి పర్యటనలు - కుటుంబ పాలనకు అంతం పలకాలంటూ ప్రచారాలు
Harish Rao on Congress Past Ruling :కాంగ్రెస్ నేతలను నమ్మితే మోసపోవడం ఖాయమని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. హస్తం నాయకులు ప్రకటించిన మేనిఫెస్టో కంటే బీఆర్ఎస్ మేనిఫెస్టో చాలా నయమని చెప్పారు. తమ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 3 గంటలు సరిపోతుందంటున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.