Minister Harish Rao Fires on Congress :కాంగ్రెస్‌కి 11 సార్లు ఓటు వేస్తే మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ గెలవగానే అందరికీ మంచినీళ్లు ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చారని కొనియాడారు. దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు(Harish Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 69 లక్షల మంది రైతులు కేసీఆర్‌ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని కోరారు. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.
Dubbaka BRS Praja Ashirvada Sabha :కారుకి ఓటు వేస్తే 24 గంటలు.. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే మూడు గంటలు కరెంట్ అని హరీశ్‌రావు విమర్శించారు. రైతుబంధు రావాలంటే కారు గెలవాలన్న మంత్రి.. కాంగ్రెస్ ఖతమైతేనే రూ.16 వేల రైతుబంధు వస్తదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లవి రైతు వ్యతిరేక విధానాలని.. దయచేసి ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఈ నెల 30వ తారీఖు నాడు క్యూలో నిలుచున్నప్పుడు కాంగ్రెస్ హయాంలోని కష్టాలను గుర్తు తెచ్చుకొని ఓటు వేయాలని చెప్పారు. రైతుబంధు అంటే కాంగ్రెస్ గిట్టదన్నారు. యాసంగి పెట్టుబడికి రైతుబంధు ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్లు ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుందని వివరించారు.
BRS Election Campaign in Dubbaka :దేవుడు మంచి పక్షానే నిలబడతాడని.. ఎలక్షన్ కమిషన్‌కి వెళ్లి రైతుబంధు పైసలు వేసుకోవచ్చు అని అనుమతి వచ్చిందని మంత్రి చెప్పారు. ఇవాళ, రేపు సెలవు ఉండడంతో మంగళవారం రైతుబంధు పడి రైతులు ఫోన్లు టంగుటంగుమని మోగుతాయని పేర్కొన్నారు. కేసీఆర్ పేద ప్రజల సంపదను పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీడీ కట్టల మీద బుర్ర గుర్తు పెట్టి మనల్ని ఆగం చేశారని విమర్శించారు. బీజేపీ ఏమో బీడీ కట్టల మీద జీఎస్టీ పేరుమీద 5 శాతం పన్ను వేశారని మండిపడ్డారు. బీడీ కార్మికుల కష్టాలు తెలుసు గనుకనే కేసీఆర్ వారికి పెన్షన్ ఇచ్చారని పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వారికి రూ.5000 పెన్షన్ పెంచుతారని తెలిపారు.
'బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్ పార్టీనే - తల తెగిపడినా దిల్లీ నేతలకు తలవంచం'