తెరాస ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కొందరు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లిలో రాజీవ్ రహదారికి ఇరువైపులా 1200 మొక్కలు నాటడమే లక్ష్యంగా చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్‌లో మంత్రి హరీశ్ పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు- డీసీసీబీ బ్యాంకును మంత్రి ప్రారంభించారు.
ప్రజల మధ్య మేమున్నాం... గాంధీభవన్‌లో వాళ్లున్నారు: మంత్రి హరీశ్
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి గ్రామంలో నిర్వహించిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు-డీసీసీబీ బ్యాంకు ప్రారంభించారు. ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్న తమపై కొందరు పని కట్టుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
minister harish rao fire on congress leaders
ప్రజల మధ్యన ఉండి తాము మాట్లాడుతున్నామని... గాంధీ భవన్లో కూర్చుని వారు మాట్లాడుతున్నారని మంత్రి కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో జనానికి ధైర్యం చెప్పి, జనం మధ్యలోనే ఉంటున్నామన్నారు. 70 ఏళ్లు కాంగ్రెస్, తెదేపాలు పరిపాలిస్తే.. చేయని పనిని 6 ఏళ్లలో తెరాస ప్రభుత్వం చేసి చూపించిందని వివరించారు.