తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్​రావు - Minister Harish rao election campaigning at Ghapur

సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘన్​పూర్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. భాజపాకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. జిల్లా మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదేనంటూ హామీ ఇచ్చారు.

మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్​రావు
మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్​రావు

By

Published : Oct 29, 2020, 12:28 PM IST

రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెరాస అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘన్​పూర్‌లో మంత్రి ప్రచారం నిర్వహించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇచ్చారా అని హరీశ్‌ ప్రశ్నించారు. గతంలో ఓట్ల కోసం వస్తే బిందెలు పెట్టి నీటికోసం మహిళలు ప్రశ్నించేవారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉందా అని అడిగారు.

గత పాలకులు భూమి యజమానుల నుంచి శిస్తు వసూలు చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం చరిత్ర తిరగరాసి రైతుబంధు ద్వారా డబ్బులు ఇచ్చారని తెలిపారు. విదేశీ మక్కలు తెచ్చి రైతుల నోట్లో మట్టికొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. భాజపాకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. జిల్లా మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదేనంటూ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:మక్కలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details