తెలంగాణ

telangana

ETV Bharat / state

నాతో నడిచే వ్యక్తిని ఎన్నుకోండి: హరీశ్​ రావు

తనతో నడిచే వ్యక్తిని ఎన్నుకోవాలని ఓటర్లను మంత్రి హరీశ్​ రావు కోరారు. ఓట్ల కోసం పెట్టె కోతి దండాలను నమ్మొద్దని సూచించారు. మండు ఎండల్లో సైతం చెరువులు మత్తడి దూకుతున్నాయని మంత్రి గుర్తుచేశారు. సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.

minister harish rao, election campaign at siddipet
నాతో నడిచే వ్యక్తిని ఎన్నుకోండి: హరీశ్​ రావు

By

Published : Apr 25, 2021, 7:23 PM IST

ఆకలి అయినప్పుడు అన్నం పెట్టేటోడు కావాలా... ఓట్లప్పుడు వచ్చే పార్టీ మనుషులు కావాలా అని మంత్రి హరీశ్​ రావు ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణంలోని 4, 17 వార్డుల్లో తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. పట్టణంలో మహిళా భవనాలు కట్టించామని, ఒకప్పుడు నీళ్లు దొరకని సిద్దిపేటలో నేడు ఇంటింటికి మంచినీళ్లు అందిస్తున్నామన్నారు. యూజీడీ ద్వారా మురుగు నీరు పంపి పట్టణాన్ని అందంగా రూ.270 కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.

కొద్దీ రోజుల్లోనే దోమలు లేని పట్టణంగా తయారు చేసుకున్నామని అన్నారు. పందులు పోయాయి, ఇగ కోతుల సమస్య ఉండటం వల్ల వాటిని కూడా వెల్లగొట్టామని అన్నారు. కుక్కల సమస్య తీర్చేందుకు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ దవాఖానాను రూ.60 లక్షలతో నిర్మించినట్లు వెల్లడించారు. మీ ప్రతి అవసరాన్ని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నామని, త్వరలోనే అన్ని సమస్యలను తీరుస్తామని చెప్పారు. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని, వైద్యం మెరుగుపరిచామని చెప్పారు.

సిద్దిపేట తెరాసకు అడ్డా కావాలని హరీశ్​ రావు అన్నారు. తనకు కొండంత ధైర్యం ఉండాలంటే తెరాస అభ్యర్థికి అండగా నిలవాలని కోరారు. విడిపోతే నష్టపోతాం కలిసి ఉంటే అభివృద్ధి సాధిస్తామన్నారు. ఇక మిగిలింది ఉద్యోగ కల్పన జరగాలని... ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏడాది వరకు సిద్దిపేటకు చుకు చుకు మంటూ రైలు రాబోతుందన్నారు. కప్పల కుంటను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి అర్హుడికి ఇంటిని ఇస్తున్నామని, ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణానికి డబ్బులు అందిస్తున్నామని హరీశ్​ రావు వెల్లడించారు.

ఇదీ చూడండి:'ఏడేళ్లలో ఇచ్చినా హామీలను తెరాస మరిచిపోయింది'

ABOUT THE AUTHOR

...view details