కొవిడ్ కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గినప్పటికీ... సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ నిరాటంకంగా కొనసాగిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.
'ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చిన ఘనత ఆయనదే' - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు
రాష్ట్ర ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని... మంత్రి హరీశ్ రావు అన్నారు. కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను నిరాటంకంగా ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.

గజ్వేల్‌లో రెండు పడకల ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యంతో గజ్వేల్ దశ, దిశ మారిందని పేర్కొన్నారు. గజ్వేల్ సమీకృత మార్కెట్ దేశానికే నమూనాగా నిలిచిందని గుర్తుచేశారు. రాష్ట్ర సర్కారు నుంచి లబ్ధి పొందిన వారే ప్రభుత్వాన్ని విమర్శిస్తే... సూర్యుడిపై ఉమ్మి వేసినట్టేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఇదీ చదవండి: RAITHUBANDHU: ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు