సిద్దిపేటను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు వీధి వ్యాపారులు తమ వంతు సహకారం అందించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో మూడో విడతలో భాగంగా 200 మంది వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణ మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో చిన్నాభిన్నం అయిన చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు.
'ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు వీధి వ్యాపారులు సహకరించాలి' - Plastic-free city
సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో మూడో విడతలో భాగంగా 200 మంది వీధి వ్యాపారులకు రుణ మంజూరు పత్రాలను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. జనాభా ప్రాతిపదికన మరో వెయ్యి మంది వీధి వ్యాపారులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు.
minister harish rao distributed loan certificates
ఈ రుణాలను చిన్న వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పటి వరకు 3028 మందికి రూ.3 కోట్ల 2 లక్షల 80వేల రుణాలు అందించామన్నారు. జనాభా ప్రాతిపదికన మరో వెయ్యి మంది వీధి వ్యాపారులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.