దేశంలో ఎక్కడ లేని విధంగా పేదింటి ఆడ బిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని వయోల గార్డెన్స్‌లో నియోజకవర్గ పరిధిలోని 542 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 542 మందికి గానూ 5 కోట్ల 37 లక్షల 92 వేల రూపాయలు అందించామని తెలిపారు. తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లిపై ఎంత బాధ్యత ఉంటుందో ముఖ్యమంత్రికి తెలుసు కాబట్టే ఇంత చక్కటి పథకం ప్రారంభించారన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసిన హరీశ్ - minister harish rao
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 542 మంది లబ్ధిదారులకు మంత్రి హరీశ్‌రావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసిన హరీశ్
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసిన హరీశ్
ఇవీ చూడండి: పల్లె ప్రగతి కోసమే 30 రోజుల ప్రణాళిక: సబిత