దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు భరోసాగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ కొండ భూదేవి గార్డెన్లో సిద్ధిపేట అర్బన్, మున్సిపాలిటీ పరిధిలోని 286 మంది లబ్ధిదారులకు రూ. 2 కోట్ల 86 లక్షల 33 వేల విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
వారి పట్ల వివక్షత వద్దు...
కరోనా మహమ్మారి బాధితుల పట్ల సమాజంలో మార్పు రావాలన్నారు. కొవిడ్ అనగానే అతిగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు.