సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో గ్రామైక్య సంఘాలు, పీఏసీఎస్‌లకు యాసంగి సీజన్‌కు సంబంధించి రూ.10.59 కోట్లు విలువైన చెక్కులు అందించారు. రైతులకు పెండింగులో ఉన్న చెల్లింపులు 15 రోజుల్లో అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల బలోపేతానికి కృషి: మంత్రి హరీశ్ - సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు పర్యటన
రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో హరీశ్ రావు పాల్గొన్నారు. సిద్దిపేటలో గ్రామైక్య సంఘాలు, పీఏసీఎస్‌లకు యాసంగి సీజన్‌కు సంబంధించిన రుసుం చెల్లింపుల చెక్కులు అందించారు.
'ధాన్యం కొనుగోలు కేంద్రాల బలోపేతానికి కృషిచేస్తాం'
మహిళలు అద్భుతంగా ధాన్యం కొనుగోళ్లు చేశారని... ఎక్కడి ధాన్యం అక్కడే కొనుగోలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు పాల్గొన్నారు.