తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆటో, టాక్సీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు' - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్​డౌన్​ కారణంగా నష్టపోతున్న ఆటో, టాక్సీ డ్రైవర్లకు... మంత్రి హరీశ్​ రావు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సిద్దిపేటలో అక్షయ పాత్ర-ఇండియా టీవీ ఆధ్వర్యంలో దాదాపు 600 కుటుంబాలకు సరకులు అందజేసినట్లు తెలిపారు.

Minister Harish Rao distributed essentials
ఆటో, టాక్సీ డ్రైవర్ల కుటుంబాలకు మంత్రి హరీశ్​రావు అండ

By

Published : May 23, 2021, 8:58 PM IST

లాక్​డౌన్ కారణంగా ఆటో, టాక్సీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని... మంత్రి హరీశ్ ​రావు అన్నారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో అక్షయ పాత్ర, ఇండియా టీవీ ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు నిత్యావసర సరకులు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

చాలా కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు. అక్షయ పాత్ర, ఇండియా టీవీ స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని గొప్ప పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఆస్పత్రుల్లో రోగులకు కడుపునిండా అన్నం పెట్టి సహాయ సహకారాలు అందించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా.. దొంగతనాలు

ABOUT THE AUTHOR

...view details