ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఓ వరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఆయన నివాసంలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులను వెంటనే బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని సూచించారు. కరోనా వంటి సంక్షోభం వచ్చినా... రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఓ వరం : మంత్రి హరీశ్ - ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంచిన హరీశ్ రావు
సిద్దిపేట నియోజకవర్గంలో 15 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. సీఎం సహాయనిధి పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని అన్నారు.
HARISH RAO
కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.