తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2021, 4:01 PM IST

ETV Bharat / state

Harish Rao : పేదలకు అండగా సీఎం సహాయనిధి

ముఖ్యమంత్రి సహాయనిధి.. నిరుపేదలకు వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో.. 8 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.

harish rao, cm relief fund
హరీశ్ రావు, మంత్రి హరీశ్ రావు, సీఎం సహాయ నిధి

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 8 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. చెక్కులు వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని మంత్రి సూచించారు.

సిద్దిపేట పట్టణంలో ఇద్దరు, రూరల్ మండలంలో మరో ఇద్దరు, చిన్నకోడూరు మండలంలో-2, నంగునూరులో ఇద్దరు సీఎం సహాయనిధి చెక్కులు పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, ఏఎంసీ ఛైర్మన్ పాల సాయిరాం, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details