సంప్రదాయ విధానంలో కాకుండా ఆధునిక విధానంలో పంటలు పండించి అధిక లాభాలు ఆర్జించాలని రైతులకు... మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట పట్టణం విపంచి కళా నిలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 350 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. రైతు బంధు రాని వారు యాసంగి పంట వరకు ఆన్లైన్ చేయించుకోవాలని తెలిపారు. రెండో పంటకు అందరికీ రైతుబంధు అందుతుందని పేర్కొన్నారు.
'సంప్రదాయ పంటలు మానేద్దాం... కమర్షియల్ పంటలు పండిద్దాం' - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు
ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురవడం వల్ల జలాశయాలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అన్నదాతలు అధిక దిగుబడి వచ్చే పంటలు పండించి లబ్ధి పొందాలని సూచించారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో నియోజకవర్గలోని 350 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
'సంప్రదాయ పంటలు మానేద్దాం... కమర్షియల్ పంటలు పండిద్దాం'
వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు వాడొద్దని మంత్రి సూచించారు. పామాయిల్ తోటల పెంపు కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని.. అందుకోసం సిద్దిపేట జిల్లాకు అనుమతి తెచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. సంప్రదాయ పంటలు కాకుండా... కమర్షియల్ పంటలు పండించాలని అన్నదాతలకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి:ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్ గణపయ్య