రెండు పడక గదుల ఇళ్లు పేద ప్రజల కల అని రాష్ట్ర ఆర్థికశాక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట కేసీఆర్ కాలనీలో 168 మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. ఉద్యోగి ఇల్లు కట్టుకున్నా... ఎంతో కొంత అప్పు అవుతుంది కానీ... ఖర్చు లేకుండానే పేదవారి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అప్పు లేకుండానే సొంతింటి కల సాకారం: హరీశ్ - సిద్దిపేట కేసీఆర్ కాలనీలో రెండుపడక గదుల ఇళ్ల పంపిణీ
ఎలాంటి అప్పు లేకుండానే... పేదవారి సొంతింటి కల సీఎం కేసీఆర్తో సాకారమవుతోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ సిద్దిపేట కేసీఆర్ కాలనీలో 168 రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అప్పు లేకుండానే సొంతింటి కల సాకారం: హరీశ్
మనిషి జీవితంలో ముఖ్యమైన ఇల్లు, పెళ్లికి ప్రభుత్వ సాయం చేస్తోందని హరీశ్ అన్నారు. అనర్హులు ఇల్లు తీసుకుంటే... మరో పేదవాడికి అన్యాయం చేసినట్టేనన్నారు. తనను, కేసీఆర్ను, ప్రభుత్వాన్ని విమర్శించే భాజపా కార్యకర్తలకు కూడా ఇల్లు వచ్చిందని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఇల్లు విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:కొత్త యంత్రాలు.. సొగసుకు అద్దెను మెరుగులు