తెలంగాణ

telangana

ETV Bharat / state

పనుల్లో వేగం పెంచండి: మంత్రి హరీశ్ రావు - గౌరవెల్లి ప్రాజెక్టు వార్తలు

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులపై మంత్రి హరీశ్‌ రావు సమీక్షించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు.

minister harish rao, gouravelli project
మంత్రి హరీశ్‌రావు, గౌరవెల్లి ప్రాజెక్టు

By

Published : Feb 4, 2021, 9:13 AM IST

గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇరిగేషన్‌ అధికారులను ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. బుధవారం.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని రిజర్వాయర్ పనులపై కలెక్టరేట్‌లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా రిజర్వాయర్ పనుల పురోగతిని ఎమ్మెల్యే సతీశ్ కుమార్ వివరించి పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తెచ్చారు. త్వరలో ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గ, జిల్లా రైతుల ఆకాంక్షలు నెరవేర్చాలని మంత్రిని కోరారు.

రిజర్వాయర్ బండ్‌ పనులు, ప్రధాన కాలువ, పంప్ హౌస్, సర్జిపూల్, టన్నెల్, టన్నెల్ లైనింగ్ పనులు, గ్రావిటీ కెనాల్ లైనింగ్, ప్రధాన కాలువ, కాలువ భూసేకరణ తదితర అంశాలపై ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో మంత్రి చర్చించారు. బండ్ పనులతో పాటు భూ సేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు ప్రాజెక్టుకు నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 11.8 కి.మీ మేర టన్నెల్ లైనింగ్, 6.9 కి.మీ మేర గ్రావిటీ కెనాల్ లైన్ పూర్తయిందని మంత్రి వివరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా నిర్వాసితులకు పరిహారం చెల్లించే అంశంపై ప్రత్యేక చొరవ చూపేలా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో చర్చించారు.

ఇదీ చదవండి:సాగర్​ ఉపఎన్నికల్లో తెరాసదే విజయం: మహమూద్​ అలీ

ABOUT THE AUTHOR

...view details