తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటలో హరీశ్​రావు ఉదయపు నడక - latest news on minister Harish Rao conducted Morning Walk in Siddipet

సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్​రావు మార్నింగ్​ వాక్ చేశారు. వీధుల్లో తిరుగుతూ తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

minister Harish Rao conducted Morning Walk in Siddipet
సిద్దిపేటలో హరీశ్​రావు మార్నింగ్​వాక్

By

Published : Mar 9, 2020, 1:33 PM IST

సిద్దిపేట పట్టణంలోని 33, 34 వార్డుల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ.. తడి, పొడి చెత్తను వేరు చేయడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను వేరు చేసి ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.

రోడ్లపై ఎవరైనా చెత్త వేస్తే వారిని గుర్తించి జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్లపైన, ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రజలు చెత్త వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకోవాలని సూచించారు.

సిద్దిపేటలో హరీశ్​రావు మార్నింగ్​వాక్

ఇదీ చూడండి:ఎస్​ బ్యాంక్​ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details