తెరాస పార్టీని దెబ్బకొట్టడానికి భాజపా, కాంగ్రెస్ పార్టీలు అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, భాజపా నేతలు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. భాజపాకు అనుకూలంగా మారడం కోసం... వేరే నియోజకవర్గానికి చెందిన ఓ దళిత నాయకుడిని హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పోటీకి నిలపడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కమలం పార్టీ సైతం ఇతర దళిత నేతలను హుజూరాబాద్‌లో పోటీ చేయించాలని చూస్తోందని... దీని వల్ల ఈటల రాజేందర్‌కు అనుకూలత ఏర్పడుతుందనే భ్రమలో ఉన్నారని విమర్శించారు. దళితబంధు పథకంతో దళితులంతా తెరాస వైపు నిలవడం వల్ల ఆ రెండు పార్టీలు కుమ్మక్కులకు పాల్పడుతున్నాయని మంత్రి హరీశ్ ఆరోపించారు.
HARISH RAO: 'దళితుల ఓట్లను చీల్చడానికి ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయి' - telangana varthalu
హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. దళితబంధు పథకంతో దళితులంతా తెరాస వైపు నిలవడం వల్ల ఆ రెండు పార్టీలు కుమ్మక్కులకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీతో కొట్లాడి ఈటల రాజేందర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా అంటూ ప్రశ్నించారు.
ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 దాటిందని... భాజపాకు ఓటు వేస్తే వచ్చే ఏడాది వరకు రూ.200 దాటుతాయని... గ్యాస్ సిలిండర్ ధర రూ.1,500 దాటుతుందని మంత్రి ఎద్దేవా చేశారు. మోదీ ఫొటోతో ప్రచారం చేస్తే ఓట్లు పడవని ఈటల రాజేందర్ ప్రచార శైలిని మార్చారని ఆయన అన్నారు. మోదీతో కొట్లాడి ఈటల రాజేందర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా అంటూ ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఎత్తుగడలకు హుజూరాబాద్‌లో మోసపోయే పరిస్థితి లేదన్నారు. మోదీ అవలంభిస్తున్న విధానాలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే బలహీనంగా మారిందన్నారు. అందుకే బంగాల్, తమిళనాడులో భాజపాను బండకేసి కొట్టారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: