సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పద్మనాభునిపల్లి గ్రామంలో జరిగిన ఏకగ్రీవ తీర్మానం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గ్రామస్థులంతా తెరాసను గెలిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని మంత్రి వ్యాఖ్యానించారు.
''ఇటీవల మా ఆర్థిక మంత్రులకి మీటింగ్ అయింది. మీకు రూ.2,500 కోట్లు కావాలంటే... బావులు, బోర్ల వద్ద మీటర్లు పెట్టండి అన్నారు. పెట్టాల్నా మరీ..? పెట్టి 2,500 కోట్ల రూపాయలు తెచ్చుకోవాల్నా? అదే మన పక్కన ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి రూ.4,000 కోట్లు ఆఫర్ ఇచ్చారు. పోయిండు. నాలుగు వేల కోట్లు తెచ్చుకున్నడు. మీటర్లు పెడుతున్నడు.''