రైతుల నుంచి అధికారులు బలవంతంగా భూములు లాక్కున్నారని ప్రతిపక్షాలు ఆరోపించడం సిగ్గుచేటని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు నర్సింహులు భూమిని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం స్వాధీనం చేసుకున్నారని నిజాలు తెలిసి కూడా ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. స్వలాభం కోసం అమాయకులను బలి పశువులుగా చేసి విపక్షాలు రాజకీయ ప్రేరేపిత హత్యలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు.
'నర్సింహులు విషయంలో ప్రతిపక్షాలవి శవ రాజకీయాలు' - harish rao fire on congress
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని వేలూరులో ఎస్సీ రైతు నర్సింహులు మృతి దురదృష్టకరమని మంత్రి హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్వలాభం కోసం అమాయకులను బలి పశువులుగా చేసి విపక్షాలు రాజకీయ ప్రేరేపిత హత్యలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు.
minister harish rao comment on farmer narsimlu death
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని వేలూరులో ఎస్సీ రైతు నర్సింహులు మృతి దురదృష్టకరమని... ఈ ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత రైతు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాతో పాటు ఎకరం భూమి తక్షణ సాయం కింద రెండు లక్షల రూపాయలు, మృతుని పిల్లలకు, ప్రభుత్వ ఖర్చుతో విద్యను అందిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.