బీడీ కార్మికులకు రూ. 1,600 పెన్షన్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్, భాజపా అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెరాసకు మద్దతుగా మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెరాస అభ్యర్థి సుజాత, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు.