సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 23వ వార్డులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో మంత్రి హరీశ్ రావు ఓటుహక్కు వినియోగించుకున్నారు. దాదాపు 40 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని... ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హరీశ్‌రావు సూచించారు.
'మంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఇదే సరైన సమయం' - ఓటు హక్కు వినియోగించుకున్న హరీశ్ రావు
ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఇదే మంచి సమయమని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పోలింగ్ 40 శాతానికి పైగా జరిగిందని... సాయంత్రం వరకు సమయమున్న నేపథ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
'మంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఇదే సరైన సమయం'
ప్రజాస్వామ్య పరిరక్షణకు మంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఇదే సరైన సమయమని... అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి:పుర ఎన్నికల్లో ఉద్రిక్తత... భాజపా, తెరాస నాయకుల మధ్య ఘర్షణ