తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎటువైపు ఉండాలో దుబ్బాక ప్రజలు తేల్చుకోవాలి: హరీశ్‌రావు - దుబ్బాక ఎన్నికలు 2020

కాంగ్రెస్, భాజపాలతో రైతులకు అన్యాయం తప్పదని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమానికి పాటు పడుతున్న ఏకైక పార్టీ తెరాసనేని వెల్లడించారు. రాజక్కపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... కారు గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

minister Harish Rao campaign in Rajakkapet on dubbaka by poll election
ఎటువైపు ఉండాలో దుబ్బాక ప్రజలు తేల్చుకోవాలి: హరీశ్‌రావు

By

Published : Oct 23, 2020, 11:46 AM IST

రైతు సంక్షేమానికి పాటుపడుతున్న తెరాస వైపు ఉండాలో... కర్షకులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌, భాజపా వైపు ఉండాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆర్థికమంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్​కే దక్కిందని తెలిపారు. ఫించన్లపై చర్చకు రావాలని బండి సంజయ్‌కు సవాల్‌ విసిరితే... పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. భాజపా అంటే భారతీయ జూటా పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్‌ వాళ్లకు ప్రజల కష్టాలు తెలియవన్న మంత్రి... రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న కారు గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఎటువైపు ఉండాలో దుబ్బాక ప్రజలు తేల్చుకోవాలి: హరీశ్‌రావు

ఇదీ చూడండి:దుబ్బాక ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారు: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details