తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారు: హరీశ్​ రావు - సిద్దిపేట జిల్లా వార్తలు

దుబ్బాక ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఘనపూర్, శేరూపల్లి, బందారం, నర్సంపేట గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు.

minister harish rao campaign in dubbak by elections in siddipeta district
అభివృద్ధికే పట్టం కడతారు: హరీశ్​ రావు

By

Published : Oct 22, 2020, 4:59 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్, దౌల్తాబాద్ మండలం శేరూపల్లి, బందారం, నర్సంపేట గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు సమక్షంలో తెరాసలో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమం తెరాస ప్రభుత్వం ఆరేళ్లలో చేసిందని హరీశ్​ రావు అన్నారు.

రాబోయే రోజుల్లో తొగుట మండలం మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో సస్యశ్యామలం కాబోతోందని తెలిపారు. ప్రాజెక్టులు అడ్డుకున్న వారు ఇప్పుడు ఓట్లు ఆడిగేందుకు వస్తున్నారని విమర్శించారు. దుబ్బాక ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని చెప్పారు. సీఎం కేసీఆర్ పై విశ్వాసం , నమ్మకంతో తెరాసకే జై కొడుతారని అన్నారు.

ఇదీ చూడండి:నాయిని మృతిపట్ల కాంగ్రెస్ నేతల సంతాపం

ABOUT THE AUTHOR

...view details