సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారానికి ప్రజలు భారీగా తరలి వచ్చి తెరాసకు మద్దతు తెలిపారు. భాజపా, కాంగ్రెస్ నాయకులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ మండిపడ్డారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండి ప్రచారంలో ఏడిస్తే దాన్ని కూడా వాళ్లు హేళన చేస్తూ వక్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఓడిపోతామనే భావనతోనే డబ్బుల డ్రామా ఆడుతున్నారు:హరీష్ రావు - దుబ్బాక ఉపఎన్నికలు
భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండి ఎన్నికల ప్రచారంలో ఏడిస్తే.. దాన్ని కూడా భాజపా, కాంగ్రెస్ నేతలు హేళన చేస్తూ సంస్కార హీనులుగా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ అన్నారు. వారికి మహిళలు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి హరీష్రావు దౌల్తాబాద్ మండలం దొమ్మాట లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.
ఓడిపోతామనే భావనతోనే డబ్బుల డ్రామా ఆడుతున్నారు:హరీష్ రావు
ఓడిపోతామనే భావనతోనే సిద్దిపేటలో భాజపా డబ్బుల డ్రామా ఆడుతోందని ఆరోపించారు. డబ్బులు భాజపా అభ్యర్థివి కాకపోతే ప్రచారం మానేసి ఎందుకు సిద్దిపేటకు పరిగెత్తుకొచ్చారంటూ మంత్రి హరీష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో నీళ్ల బాధ తెరాస పార్టీనే తీర్చిందని ప్రజలకు తెలిపారు. ఏ పార్టీ అభివృద్ధి చేసింది ప్రజలకు తెలుసన్నారు.
ఇవీ చూడండి: దొరికిన డబ్బులపై భాజపా నాయకుల పూటకో మాట: హరీశ్ రావు