వసంత పంచమి సందర్భంగా ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం అనంతసాగర్ గ్రామంలోని శ్రీ సరస్వతీ దేవి ఆలయాన్ని మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వసంత పంచమి పూజల్లో మంత్రి హరీశ్ రావు - మంత్రి హరీశ్ రావు పూజలు
సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంత పంచమి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు.
వసంత పంచమి పూజల్లో మంత్రి హరీశ్ రావు
వసంత పంచమి రోజున సర్వస్వతి అమ్మవారిని పూజిస్తే శుభం కలుగుతుందని... చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే.. పిల్లలు జ్ఞాన రాశులు అవుతారని అర్చకులు తెలిపారు. ఆలయ ఆవరణలో రాగి, చీకటి, పాల దోనెలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మెట్లు నిర్మించేందుకు రూ.10లక్షలు వెచ్చిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇదీ చూడండి:జోగులాంబ ఆలయంలో కేసీఆర్ కుటుంబం..