తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao: 'భూమిపై సర్వ హక్కులు కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి' - Harish Rao at the house title distribution

Harish Rao distribution houses pattas: భూమిపై సర్వహక్కులు కల్పించిన సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను మంత్రి హరీశ్​రావు కోరారు. 'ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా జరగని పనిని పూర్తి చేసి.. ఇంటికి పిలిపించి మీ చేతికి పట్టా అందించి.. భోజనం పెట్టించి మరీ పంపిస్తున్నామని' మంత్రి పేర్కొన్నారు. సిద్ధిపేట పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో పలువురికి ఇళ్ల పట్టాలను ఆయన అందజేశారు.

Harish Rao
Harish Rao

By

Published : Apr 17, 2023, 8:23 PM IST

Harish Rao distribution houses pattas: మంత్రి హరీశ్​రావు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. పట్టణంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో సుమారు 148 మంది లబ్ధిదారులకు 58, 59 జీవో కింద మంజూరైన ఇళ్ల ధృవీకరణ పట్టా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. ప్రభుత్వ భూమిలో తెలిసో, తెలియకో ఇళ్లు కట్టుకున్న కొంత మంది ఎన్నో ఏళ్లుగా భయబ్రాంతులతో ఆ భూమిపై హక్కు లేక ఆందోళన చెందుతున్నారని.. వారికి భూమిపై సర్వ హక్కులు కల్పించేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.

ఇప్పటి వరకూ సిద్దిపేటలో 569 మందికి 59 జీవో కింద పట్టాలు అందజేసినట్లు హరీశ్​రావు తెలిపారు. ఆరోగ్య సిద్దిపేట కావాలన్నదే తన కల అని.. ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా బతకాలన్నదే తన తపన అని వ్యాఖ్యానించారు. పట్టణంలో యూజీడీ పూర్తి చేశామని పేర్కొన్నారు. పందులు, పశువుల బెడద తొలగించామని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరుగా చేసి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అలాగే ప్రతి ఇంటి ముందు చెట్లు నాటి సంరక్షించాలని ప్రజలకు హరీశ్ రావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలే గమనించాలని సూచించారు. భూమిపై సర్వ హక్కులు కల్పించిన సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్​రావు కోరారు. 'ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా జరగని పనిని.. పూర్తి చేసి ఇంటికి పిలిపించి.. మీ చేతికి పట్టా అందించి.. భోజనం పెట్టించి మరీ పంపిస్తున్నామని' మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను లబ్ధిదారులకు వివరించారు.

"కబ్జాలో ఉన్న భూమిపై సర్వహక్కులు కల్పించిన సీఎం కేసీఆర్, పని చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా జరగని పనిని.. పూర్తి చేయించి.. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి.. మీ చేతికి పట్టా అందించి, భోజనం పెట్టించి పంపిస్తున్నాం. ఇప్పటి వరకు సిద్ధిపేటలో 569 మందికి 59 జీవో కింద పట్టాలు అందజేశాం. మీ భూమిపై మీకు సర్వ హక్కులు కల్పించేలా ఈ కార్యక్రమం చేపట్టాం. ఆరోగ్య సిద్దిపేట కావాలన్నదే నా కల.. నా ప్రయత్నం. ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా బతకాలన్నదే నా తపన."- హరీశ్ రావు, ఆర్థికశాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details