దుబ్బాకకు గోదావరి నీళ్లు రాబోతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి వానాకాలంలోపే కాలువలు, చెరువులు నింపాలని అధికారులకు సూచించారు. రెండు పంటలకు నీళ్లు ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని మంత్రి తెలిపారు. రైతులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
'చెరువులు నిండి... రెండు పంటలు పండాలి' - మంత్రి హరీశ్ రావు వార్తలు
దుబ్బాక వద్ద కాలువ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి... వానాకాలంలోపే చెరువులు, కాలువలు నింపాలని మంత్రి సూచించారు.
'చెరువులు నిండి... రెండు పంటలు పండాలి'
సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని అసన్ మీరాపూర్ వద్దగల ప్యాకేజీ 12 కాలువ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, అధికారులు, స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:సొంత స్కూల్లోనే బోర్డ్ పరీక్షలు- జులై చివర్లో ఫలితాలు