సిద్దిపేటలోని మెదక్ రోడ్లో రైతుబజార్ ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణ కిరాణా దుకాణంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి... కాగితం, బట్ట సంచుల్లో సరుకులు ఇవ్వటాన్ని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. రైతుబజార్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసిన మానవత్వపు గదిని మంత్రి పరిశీలించారు. ఎదురుగా ఉన్న కిరాణా దుకాణంలో ప్లాస్టిక్ వాడటంలేదని తెలుసుకుని మంత్రి స్వయంగా పరిశీలించారు. వినియోగదారులకు కేవలం కాగితం, బట్ట సంచుల్లోనే సరుకులు ఇవ్వటాన్ని గమనించిన మంత్రి దుకాణపు యజమాని భాస్కర్‌ను ప్రశంసించారు. ప్లాస్టిక్ కవర్ల నిషేధం పట్ల మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ కృష్ణ కిరాణా దుకాణం స్ఫూర్తే... పట్టణమంత విస్తరించాలని సూచించారు.
దుకాణాదారుకు మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు.. - దుకాణదారుకు మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు..
ప్లాస్టిక్ నిషేధం పట్ల సిద్దిపేటలోని ఓ దుకాణ యజమాని చేస్తున్న కృషిని మంత్రి హరీశ్‌రావును అభినందించారు. ప్లాస్టిక్‌ను నిషేదించాలని మంత్రి హరీశ్‌రావు తరచూ చెప్పిన మాటలకు స్ఫూర్తి పొందిన దుకాణ యజమాని... వినియోగదారులకు కేవలం కాగితం, బట్ట సంచులను అందిస్తున్నాడు.
MINISTER HARISH RAO APPRECIATE A SHOP OWNER AT SIDDIPET