సిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది రూ. 4కోట్ల 87 లక్షలతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు చిన్న కోడూరు మండలం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్, సిద్దిపేట కోమటి చెరువులో చేప పిల్లలు, రొయ్య పిల్లలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 93కోట్లతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తలసాని పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచే శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
ఏడేళ్ల కింద చేపలను ఆంధ్రా నుంచి దిగుమతి చేసుకునే వాళ్లం.. కానీ ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. తెలంగాణ చేపలు, రొయ్యలకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఘనత సాధించడంలో సీఎం కేసీఆర్, మంత్రి తలసాని కృషి ఎంతో ఉంది. -హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి