సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో 100 పడకల కొవిడ్-19 వార్డుని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు ప్రారంభించారు. ఆర్వీఎం ఆసుపత్రి ముందుకు వచ్చి కరోనా పేషంట్లకు సేవ చేస్తాననడం గొప్ప విషయమన్నారు. ఆస్పత్రిల్లో నాలుగో తరగతి కేటగిరీలో పనిచేస్తూ సేవలందిస్తున్న స్వీపర్లు, నర్సులకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
100 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి, ఎంపీ - లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్
కరోనా వచ్చిన వారు బయడాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఎలాంటి అనుమానం ఉన్నా గజ్వేల్, సిద్దిపేటలో పరీక్షలు చేస్తున్నారు వచ్చి చేయించుకోవాలని మంత్రి తెలిపారు. అన్ని పీహెచ్‌సీల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామని ప్రజలకు చెప్పారు.
![100 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి, ఎంపీ minister harish rao and mp prabhakar reddy opened the 100-bed hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8127294-779-8127294-1595413135697.jpg)
100 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి, ఎంపీ
కరోనా పేషంట్లు ఎంతమంది వచ్చినా చికిత్స చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని హరీశ్‌రావు తెలిపారు. వ్యాధి లక్షణాలు కొద్దిగా ఉన్నా కూడా ఆస్పత్రికి వచ్చి పరీక్ష చేయించుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. కరోనా కష్ట కాలంలో పోలీసులు, వైద్యులు మన కోసం కృషి చేస్తున్నారని అన్నారు.
ఇదీ చూడండి :కరోనా వైరస్ కన్నా ముందు ఆందోళనే చంపుతోంది