తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్​ బెడ్​రూం ఇళ్ల పట్టాలు అందజేసిన మంత్రి హరీశ్​

పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకగా రెండు పడక గదుల ఇళ్ల గృహ సముదాయం ఉందని మంత్రి హరీశ్​ అన్నారు. దేశంలోని అన్నీ హంగులు, వసతులతో నిర్మించిన తొలి కాలనీ సిద్దిపేటలోని కేసీఆర్ నగరేనని మంత్రి తెలిపారు.

డబుల్​ బెడ్​రూం ఇళ్ల పట్టాలు అందజేసిన మంత్రి హరీశ్​
డబుల్​ బెడ్​రూం ఇళ్ల పట్టాలు అందజేసిన మంత్రి హరీశ్​

By

Published : Jan 8, 2021, 9:59 PM IST

గూడు లేని నిరుపేదల కోసం డబుల్ బెడ్​రూం ఇళ్లను నిర్మించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ నగర్ రెండు పడక గదుల ఇళ్ల గృహ సముదాయం ఉందని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట కేసీఆర్ నగర్ ఆడిటోరియంలో 272 మంది ఎనిమిదో విడత లబ్ధిదారులకు మంత్రి పట్టాలను పంపిణీ చేశారు. పేదప్రజలు ఆత్మ గౌరవంతో బతకాలన్న ఉద్దేశతో ఆర్థికంగా భారమైనప్పటీకి ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కేసీఆర్​ నగర్​లో సకల సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. దేశంలోని అన్నీ హంగులు, వసతులతో నిర్మించిన తొలి కాలనీ సిద్దిపేటలోని కేసీఆర్ నగరేనని మంత్రి తెలిపారు.

రూపాయి ఖర్చు లేకుండా ఇళ్లు లేని పేదవారికే డబుల్ బెడ్​రూం ఇండ్లు కేటాయించామన్నారు. 5 సార్లు వడపోత తర్వాతే నిజమైన లబ్ధిదారుల ఎంపికను చేపట్టామన్నారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేసే సమయంలోనే.. పట్టా ఉత్తర్వుతో పాటు నల్లా కనెక్షన్ మంజూరు పత్రం, కరెంట్ కనెక్షన్, ఇంటి నెంబర్, గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నామన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో కేసీఆర్ నగర్​ను అనుసంధానం చేశామన్నారు.

ఇదీ చదవండి: రద్దీకి చెక్​ పెట్టేందుకే.. శాటిలైట్​ బస్​ టెర్మినల్స్​

ABOUT THE AUTHOR

...view details