తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish rao: 'దొడ్డు వడ్ల సంగతి తేల్చుకునే.. సీఎం దిల్లీ నుంచి వస్తానన్నారు' - minister harish cheques distribution in palamakula of siddipet district

సీఎం కేసీఆర్​ హయాంలో రాష్ట్ర వ్యవసాయం వృద్ధి సాధించిందని మంత్రి హరీశ్ ​రావు(Harish rao) అన్నారు. కానీ రాష్ట్రం పండించిన పంటలు కొనే బాధ్యత కేంద్రానిదే అని పేర్కొన్నారు. దొడ్డు వడ్ల సంగతి తేల్చుకునే కేసీఆర్(cm kcr) దిల్లీ నుంచి వస్తారని చెప్పారు. సిద్దిపేట జిల్లా పాలమాకులలో పర్యటించిన హరీశ్​.. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు.

harish rao
హరీశ్​ రావు

By

Published : Sep 26, 2021, 3:31 PM IST

కేంద్రంతో దొడ్డు వడ్ల సంగతి తేల్చుకునే... సీఎం కేసీఆర్(cm kcr) దిల్లీ నుంచి వస్తానని చెప్పారని మంత్రి హరీశ్ రావు(Harish rao) పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో ఆయన పర్యటించారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. వాటితో పాటు రైతులకు పలు ఉపకరణాలను మంత్రి పంపిణీ చేశారు.

చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి హరీశ్​ రావు

కేసీఆర్​ హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని హరీశ్(Harish rao)​ అన్నారు. రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రైతులకు కనీసం పరిహారం కూడా అందించలేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేసీఆర్​ పాలనలో పంట దిగుమతులు మెరుగ్గా ఉంటే.. ఇప్పుడేమో కేంద్రం దొడ్డు వడ్లు కొననంటోంది. సీఎం కేసీఆర్​ కేంద్రంతో ఆ సంగతి తేల్చుకునే వస్తానన్నారు. రైతులు సైతం పంట మార్పిడి చేసి.. పామాయిల్‌ లాంటి పంటలను సాగు చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం పెత్తనం చేయాలని చూస్తోంది. -హరీశ్​ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

దర్గపల్లిలో రూ.7 కోట్ల రూపాయల వ్యయంతో 10 రోజుల్లో హైలెవల్ వంతెన పనులు ప్రారంభం అవుతాయని హరీశ్(Harish rao)​ తెలిపారు. హన్మకొండ నుంచి సిద్దిపేట మీదుగా రామయంపేట వరకు జాతీయ రహదారి, అదే విధంగా బస్వాపూర్ వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు.

దొడ్డు వడ్ల సంగతి తేల్చుకునే.. సీఎం దిల్లీ నుంచి వస్తానన్నారు: హరీశ్​

ఇదీ చదవండి:Modikunta Project : రూ.124 కోట్ల ప్రాజెక్టు.. రూ.700 కోట్లకు

ABOUT THE AUTHOR

...view details