సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్‌లో తెరాస కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తొగుట మండల ఎన్నికల ఇంఛార్జ్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ కొండపాక మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడం చాలా బాధాకరమని నూనె కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ టికెట్ ఎవరికి కేటాయించినా.. అందరూ కలిసికట్టుగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. గ్రామాలను అభివృద్ధి చేసుకొని బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు.