దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సొంత గ్రామమైన దుబ్బాక మండలంలోని పోతారంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
పోలింగ్ ప్రశాంతం
ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి - dubbaka by election update news
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామమైన పోతారంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
![ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి medak mp kotha prabhakar reddy casted his vote in dubbaka by election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9411630-368-9411630-1604383015889.jpg)
ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
చేగుంట, నార్సింగి మండలాల్లో ఉదయం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చూడండి: చిట్టాపూర్‌లో సుజాత.. బొప్పాపూర్‌లో రఘునందన్... తుక్కాపూర్‌లో శ్రీనివాస్‌రెడ్డి