రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సకాలంలో ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం సాయంత్రం దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస అభ్యర్థి సుజాత, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డితోపాటు రామాయంపేట నుంచి నార్సింగ్కి ప్రచారం కోసం బయలుదేరారు. మార్గమధ్యలో జప్తిశివనూర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్ల ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయాడు.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి - Padmadevender Reddy Helps Road accident Person
సాధారణంగా రోడ్డుపై ప్రమాదాలు జరిగినప్పుడు వీఐపీలు తమకెందుకులే అన్నట్లుగా వెళ్లిపోతుంటారు. కానీ ఇందుకు భిన్నంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించి పోలీసు వాహనంలో క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులను ఆమె కోరారు.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
ఇది గమనించిన వారు వెంటనే కారు ఆపి క్షతగాత్రున్ని పరామర్శించి వెంటనే పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. అంబులెన్స్ రావటం ఆలస్యం కావటం వల్ల వెంటనే రామాయంపేట సీఐ వాహనంలో నార్సింగ్ ఆసుపత్రికి తరలించారు. సంబంధిత డాక్టర్తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రునికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆమె కోరారు.
ఇవీచూడండి:గుండెపోటుతో ఓ వ్యక్తి.. మానవత్వం చాటుకున్న పోలీసులు