తెలంగాణ

telangana

ETV Bharat / state

'మోదీపై తండ్రీ కొడుకులు విష ప్రచారం చేస్తున్నారు' - మెదక్​ పార్లమెంట్​ అభ్యర్థి

ఎన్నికల సమయంలో నేతల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. కేసీఆర్​, కేటీఆర్​పై మెదక్​ జిల్లా భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్​రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తండ్రీ కొడుకులు కలిసి భాజపాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

భాజపా అభ్యర్థి

By

Published : Mar 27, 2019, 5:36 PM IST

సీఎం కేసీఆర్​ మాట మార్చారని ఆరోపిస్తున్న రఘునందన్​
ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్​ విష ప్రచారం చేస్తున్నారని మెదక్​ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్​రావు అన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ లాంటి ప్రధాని అవసరమని సిద్దిపేటలో పేర్కొన్నారు. రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించిన ప్రధాని అని గతంలో ప్రశంసించిన కేసీఆర్...​ ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. 1999 తరువాత 2019లో మెదక్​లో కచ్చితంగా భాజపా జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :వలసలతో టీపీసీసీకి వచ్చిన నష్టమేం లేదు: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details