సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ సహచరుడు, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.
ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం - CM extends deepest condolences on the death of Solipeta Ramalingareddy
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. సీఎంతోపాటు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు మంత్రులు సైతం సానుభూతి ప్రకటించారు.
రామలింగారెడ్డి మృతికి సీఎంతో సహా పలువురు మంత్రుల సంతాపం
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు సంతాపం తెలిపారు.
ఇదీ చూడండి :ఈటీవీ భారత్ స్పందన: '‘పీఎం కిసాన్’'లో తెలంగాణకు చోటు