దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా తరఫున పోటీలో ఉన్న అభ్యర్థి రఘునందన్‌రావును అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రఘునందన్‌రావు పేరుతో పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో... చర్యలు చేపట్టాలని ఈసీకి లేఖ రాశారు.
'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు' - పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి
దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఈసీకి లేఖ రాశారు. భాజపా అభ్యర్థిని రఘనందన్‌రావును డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు.
'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'
దుబ్బాకలో ఓటర్లను ప్రభావితం చేసేలా పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంచుతున్నారని పేర్కొన్నారు. అన్ని వాహనాలను తనిఖీ చేసేలా ఆదేశాలివ్వాలనన్నారు.