సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్లు పంపిణీ చేశారు.
జిల్లాలో 516 మంది లబ్ధిదారులకు 80లక్షల విలువ గల ఉపకరణాలు అందిస్తున్నామన్నారు. తమ సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు ముందుకొచ్చే వారికి సాయం చేసేందుకు బడ్జెట్లో 10వేల కోట్లు కేటాయించామని తెలిపారు. దివ్యాంగులను చిన్నచూపు చూడటం తప్పు.. వారికి చేయూతనివ్వాలని సూచించారు. వాళ్లను అవమానిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులందంరికి ప్రభుత్వం ఉపకరణాలను అందిస్తుందని ప్రకటించారు.