ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేపట్టకపోతే... కేసీఆర్ ప్రగతి భవన్ వీడి ఫామ్‌హౌస్‌కే పరిమితం కావాల్సివస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో వద్ద కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సాధ్యం కాదని చెప్తున్న కేసీఆర్... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసైన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. దినదిన గండంగా బతుకుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి... ప్రభుత్వాన్నిబేషజాలు వీడాలని కోరారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావాల్సి వస్తది: మంద కృష్ణ - కేసీఆర్‌పై మంద కృష్ణ మాదిగ ఘాటు వ్యాఖ్యలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు హాజరై సంఘీభావం తెలిపారు. వెంటనే చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావాల్సి వస్తది