ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో గత 20 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ సంఘీభావం తెలిపారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. అన్ని సమస్యలపై స్పందించే మంత్రి హరీశ్ ఆర్టీసీ సమ్మెపై ఎందుకు మాట్లాడడం లేదని మందకృష్ణ ప్రశ్నించారు. హరీశ్‌రావు కార్మికుల పక్షమా.. లేక కేసీఆర్ పక్షమా తేల్చుకోవాలన్నారు. పదవులు శాశ్వతం కాదని ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ - manda krishna question to minister harish rao on tsrtc strike
సమస్యలపై వెంటనే స్పందించే మంత్రి హరీశ్‌రావు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఎందుకు మౌనం వహించారో తెలపాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ డిమాండ్ చేశారు. కార్మిక నాయకుడిగా వ్యవహరించిన హరీశ్‌కు ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు.
హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ