తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటలో మంచు లింగ దర్శనం! - Siddipet today news

సిద్దిపేటలో రాబోయే మహాశివరాత్రి సందర్భంగా అమర్​నాథ్ మంచు లింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన కార్యక్రమం పనుల భూమి పూజను మంత్రి హరీశ్​రావు నిర్వహించారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 24 గంటల పాటు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

manchu lingam view of Mahashivaratri in Siddipet
సిద్దిపేటలో మంచు లింగ దర్శనం!

By

Published : Feb 6, 2020, 9:05 AM IST

రానున్న మహాశివరాత్రి సందర్భంగా అమర్​నాథ్ మంచు లింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన కార్యక్రమ పనులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు భూమి సిద్దిపేట పట్టణంలో పూజ చేశారు. డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట చేసిన ఈ కార్యక్రమానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య మంత్రి శ్రీకారం చుట్టారు.

సిద్దిపేటలో మంచు లింగ దర్శనం!

అమర్​నాథ్ యాత్ర తలపించేలా..

సిద్దిపేటలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. అమర్​నాథ్ యాత్ర స్మురించేలా భారీ సెట్టింగులతో హిమాలయాలు, అమర్​నాథ్ గుహ, మంచు లింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పంచగంగల అభిషేకం

భక్తులందరిచే స్వామి వారికి పంచ గంగల అభిషేకం, బిల్వార్చన చేయించేలా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వివిధ పీఠాధిపతుల వేద పండితుల ప్రవచనాలతో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి :దేవతల ఆగమనం... అట్టహాసంగా మహాజాతర ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details