సిద్ధిపేట జిల్లా రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన తుమ్మల రాజేందర్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామ శివారులోని పూరి గుడిసెలో నివాసముంటున్నారు. మామిడి కాయలు, పండ్లు, మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవారు. గురువారం నాటి ఈదురు గాలులు, వర్షానికి వారు ఉండే గుడిసెలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు బాగు చేస్తానంటూ రాజేందర్ వైరు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. మృతుడికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజేందర్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గుడిసెలో వైరు సరిచేస్తూ.. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి! - Man Died With Electric Shock In Siddipet
ఈదురు గాలులు, వర్షానికి గుడిసెలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వైరు సరి చేస్తూ విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ యజమాని కరెంట్ షాక్తో అకాల మరణం చెందడం వల్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

గుడిసెలో వైరు సరిచేస్తూ.. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి!