సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడం వల్ల వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్ పట్టణానికి చెందిన ఉప్పరి రాజయ్య రాయపోల్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలోని కూతురు వద్దకు వెళ్లి వస్తుండగా జలిగామ బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడం వల్ల 108లో గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.
ద్విచక్రవాహనం అదుపు తప్పి.. వ్యక్తి మృతి - గజ్వేల్ వార్తలు
ద్విచక్ర వాహనం అదుపు తప్పి పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడం వల్ల వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. తలకు బలమైన గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు వదిలాడు.
ద్విచక్రవాహనం అదుపు తప్పి.. వ్యక్తి మృతి
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదకు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఆంజనేయులు తెలిపారు.
ఇవీ చూడండి:విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు