తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం - fake seeds latest news

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రైతులు దుక్కులు దున్ని పంటల సాగుకు సిద్ధమవుతుండగా...మరోవైపు రైతుల అవసరాన్ని ఆసరగా చేసుకొని అక్రమార్కులు కల్తీవిత్తనాల దందాకు తెర లేపారు. నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా వక్రమార్గంలో వ్యాపారం కొనసాగిస్తూనే ఉన్నారు.

Man Arrested for selling fake seeds at Mustyala in Siddipet district
నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం

By

Published : Jun 11, 2020, 8:00 PM IST

పేరున్న బ్రాండ్ల విత్తనాలు కొనుగోలు చేస్తున్నారా....తక్కువ ధరకు వస్తున్నాయని అశపడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త. పంటలు వేసే సయమం సమీపిస్తుండటంతో రైతులను బురిడీ కొట్టించి నకిలీ విత్తనాలు అంటగట్టేందుకు కేటుగాళ్లు సిద్ధమయ్యారు.

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలలో ఎలాంటి అనుమతులు లేకుండా పత్తి, వరి విత్తనాలను విక్రయిస్తున్న చంద్రమౌళి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో రూ.3,39,460 విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్​ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details