తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంతూరిని వదిలి వచ్చుడు సంతోషం లేదు: ముంపు బాధితులు - Pragnapur Municipality, gajwel

మల్లన్నసాగర్ నిర్వాసితులు ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన పునరావాస కాలనీకి వచ్చారు. సొంతూరిని వదిలిన బాధను దిగమింగుకుని కంటతడి పెడుతూనే గృహప్రవేశం చేశారు.

Pragnapur Municipality, gajwel
పునరావస కాలనీల్లో గృహ ప్రవేశం

By

Published : Apr 8, 2021, 2:22 AM IST

మల్లన్నసాగర్ ముంపు బాధితులు పుట్టిన ఊరిని, సొంతింటిని వదులుకున్న బాధను దిగమింగుకుని.... గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన పునరావాస కాలనీకి వచ్చారు. పూజలు నిర్వహించి గృహ ప్రవేశం చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన డీసీఎం వాహనాల్లో.... సామాగ్రిని కాలనీకి తరలించారు.

కన్నతల్లి లాంటి ఊరిని వదిలిన బాధ మనసులో ఉండి... కంటతడి పెడుతూనే కొత్తింట్లోకి దిగారు. సొంతూరిని వదిలి... పునరావాస కాలనీకి రావడం ఏమాత్రం ఇష్టం లేదని బాధ పడుతూనే వచ్చామని వారు అంటున్నారు. ఊర్లో ఉన్న సుఖం ఇక్కడ ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. ఏ పని చేసుకోవాలో దిక్కుతోచడం లేదని చెబుతున్నారు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం కూడా రాలేదని తమ బాధను వెల్లబోసుకున్నారు.

ఇదీ చదవండి:విభజన సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోండి: కేంద్ర హోంశాఖ

ABOUT THE AUTHOR

...view details