మల్లన్నసాగర్ ముంపు బాధితుడు తనకు పునరావస ప్యాకేజీ ఇవ్వాలని ఆత్మహత్యాయత్నం చేశాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన సిబ్బంది ఆపి అతనిపై నీటిని పోసి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తి జిల్లాలోని కొండపాక మండలం సింగారానికి చెందిన మహమ్మద్ అజీజ్గా గుర్తించారు.
ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం - mallannasagar victim attempts suicide
మల్లన్నసాగర్ ముంపు బాధితుడు గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. భూ నష్ట పరిహారం వచ్చింది కానీ.. తనకు పునరావాస పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది అతనిని నిలువరించారు.
మల్లన్నసాగర్ ముంపు బాధితుడు ఆత్మహత్యాయత్నం
అతనికి రావాల్సిన నష్టపరిహారం పూర్తిగా ఇచ్చేశామని.. అతను 10 ఏళ్ల క్రితమే గజ్వేల్లో స్థిరపడడం వల్ల ప్రత్యేక ప్యాకేజీకి.. అతను అర్హుడు కాదని గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి :కొత్త ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి తప్పనిసరి: షెకావత్