సిద్దిపేట జిల్లాలోని కోర మీసాల కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంలో ఆర్జిత సేవలతోపాటు భక్తుల దర్శనాలు వారం రోజుల పాటు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ విజృంభిస్తుండడం వల్ల ఆలయంలో కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
మల్లన్న స్వామి ఆలయంలో దర్శనాలు రద్దు! - Darshans are suspended one week
సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో ఆర్జిత సేవలతోపాటు భక్తుల దర్శనాలు వారం రోజుల పాటు తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. ఆలయంలో పలువురికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మల్లన్న స్వామి ఆలయంలో దర్శనాలు రద్దు!
ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 5 నుంచి 11 వరకు అన్ని రకాల ఆర్జిత సేవలతోపాటు భక్తుల దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారి నిత్య కైంకర్యాలు, పూజలు అర్చకులచే అంతరంగికంగా నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి:ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై తెరాస నేతల ధ్వజం